మీరాబాయి చాను కు అభినందనలు: వెంకయ్యనాయుడు

భారత్ అద్భుత శుభారంభమని ఉపరాష్ట్రపతి

న్యూదిల్లీ: టోక్యో ఒలంపిక్స్ లో భారత్ అద్భుత శుభారంభం  చేసిందని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. వెయిట్‌ లిఫ్టింగ్‌లో 49 కిలోల విభాగంలో రజత పతకం సాధించిన మీరాబాయి చాను కు నా హృదయ పూర్వక అభినందనలు అని ఆయన పేర్కొన్నారు. 

ప్రధాని మోదీ ప్రశంసలు:
ఒలింపిక్స్ రజత పతకం సాధించిన మీరాబాయికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. టోక్యో ఒలింపిక్స్ భారత్ కు గొప్ప శుభారంభం అని ప్రధాని అన్నారు. అంతే కాకుండా మీరాబాయి గెలుపు ప్రతి భారతీయుడికి స్ఫూర్తి నిస్తుందని ఆయన అన్నారు. 

మిరాబాయి చాను...స్నాచ్ లో 87 కిలోలు, క్లీన్ అండ్ జర్క్ లో 115 కిలోలు మొత్తంగా 202 కిలోలు ఎత్తి రజత పతాకం భారత్ గర్వించేలా చేసింది. 1996 త‌ర్వాత ఈ ఈవెంట్‌లో భార‌త్ గెలిచిన తొలి ప‌త‌కం ఇదే కావడం విశేషం. మ‌రోవైపు చైనా వెయిట్‌లిఫ్ట‌ర్ హూ జిహూయి 210 కేజీల‌తో బంగారు పతకం గెల‌వ‌గా.. ఇండోనేషియా కాంస్య  పతకం సొంతం చేసుకుంది.