సామాజిక వైద్యుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలి: హైకోర్టు

ఆర్ ఎంపీ, పీఎంపీ ల సంఘం వేసిన పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం

హైదరాబాద్: పారామెడికల్ శిక్షణ ఇవ్వాలన్న వినతిని పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు వైద్యారోగ్య శాఖను ఆదేశించింది. చట్టానికి అనుగుణంగా వీలైనంత త్వరగా వినతి పత్రాన్ని పరిగణించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. 2015 జీవో ప్రకారం తమకు శిక్షణ ఇవ్వాలని ఆర్ ఎంపీ, పీఎంపీలు వైద్యశాఖకు వినతి పత్రం అందించారు. ఈ మేరకు ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆర్ ఎంపీ, పీఎంపీల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకన్న పిటిషన్ దాఖలు చేశారు. గత నెల 5న వినతి పత్రం ఇచ్చినప్పటికీ వైద్యారోగ్య శాఖ స్పందించడం లేదని పిటిషన్ లో వెంకన్న పేర్కొన్నారు. ఈ మేరకు హైకోర్టు వెంకన్న పిటిషన్ పై విచారణ జరిపి చట్టానికి అనుగుణంగా వీలైనంత త్వరగా వినతి పత్రాన్ని పరిగణించాలని వెల్లడించింది.