మూడో దశ కరోనా వ్యాప్తిపై సోమేశ్ కుమార్ సమీక్ష

ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచన

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా పరిస్థితలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మూడో దశ కరోనా కట్టడి సన్నద్ధతపై అధికారులతో సీఎస్ చర్చించారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. నూతన వైద్య కళాశాలల ఏర్పాటుపై చర్చించారు.  మూడో దశ కరోనా ఉధృతి వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, కరోనా పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెంచాలన్నారు. కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించేలా ప్రజలను చైతన్యవంతం చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.