ఆగస్టు 14 న టీఎస్ ఆర్ జేసీ సెట్

ఆగస్టు 9 నుంచి వెబ్ సైట్ లో హాల్ టికెట్లు

హైదరాబాద్: రాష్ట్రంలోని గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఆర్ జేసీ సెట్ పరీక్ష తేదీని సోసైటీ కార్యదర్శి ప్రకటించారు. కరోనా ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో ఈ పరీక్షను తెలంగాణ విద్యాశాఖ వాయిదా వేసింది. అయితే ఈ ప్రవేశ పరీక్షను ఆగస్టు 14 న నిర్వహించనున్నామని కార్యదర్శి పేర్కొన్నారు. ఆగస్టు 9 నుంచి వెబ్ సైట్ లో హాల్ టికెట్లు పొందవచ్చని ఆయన తెలిపారు. 35 గురుకులాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం టీఎస్ ఆర్జేసీ సెట్ నిర్వహిస్తోంది. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నవారు అధికారిక వెబ్‌సైట్‌ http://tsrjdc.cgg.gov.in నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.

మునుపటి వ్యాసం