పంట నష్టం జరిగిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు: మంత్రి

నిర్మల్ నియోజక వర్గంలో వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్: జిల్లాలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం జరిగిందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. నిర్మల్‌ నియోజకవర్గంలోని పీచ‌ర‌, ధ‌ర్మారం, చింతల్ చాంద‌ గ్రామాల్లో వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల్లో శనివారం మంత్రి పర్యటించారు. నీట మునిగిన పంట‌ల‌ను, చేప‌ల చెరువును ప‌రిశీలించారు. ఏ మేర‌కు పంట న‌ష్టంపై రైతులు, అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా స‌హాయం అందించేందుకు రెవెన్యూ శాఖ చర్యలు తీసుకుంటుంద‌ని ఆయన స్పష్టం చేశారు. భారీ వర్షాలు  కురుస్తున్నందున  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇంద్ర కరణ్ రెడ్డి సూచించారు.