వికారాబాద్ జిల్లాలో దారుణం.. బీమా సొమ్ము కాజేసిన అక్రమార్కులు

మహిళ బ్రతికుండగానే మరణ ధృవీకరణ పత్రం

వికారాబాద్: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మహిళ బ్రతికుండగానే మరణ ధృవీకరణ పత్రం సమర్పించి  మహిళా రైతు పేరు మీద బీమా సోమ్ము కాజేశారు కొందరు అక్రమార్కులు. స్థానికుల కథనం మేరకు.. జిల్లాలోని కల్వచర్ల మండలం, పుట్టాపహాడ్ గ్రామానికి చెందిన చంద్రమ్మ చనిపోయిందని చెప్పి, అతని కుమారుడు బాలయ్యకు మాయమాటలు చెప్పి బీమా డబ్బులను కాజేశారు. ఇదిలా ఉండగా తన తల్లికి రైతు బంధు రావటం లేదని బాలయ్య వ్యవసాయ అధికారులను ఆశ్రయించాడు. దీంతో విషయం బయటపడింది. చంద్రమ్మ చనిపోయిందని రికార్డుల్లో ఉందని అధికారులు వెల్లడించారు. దీనిపై కాంగ్రెస్, సీపీఐ నాయకులు నిరసన తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.