ఏపీలో కొత్తగా 2,174 కరోనా కేసులు

18 మంది మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,174 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. వైరస్‌ బారినపడిన వారిలో 2,737 మంది చికిత్సకు కోలుకున్నారు. 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం పాజిటివ్‌ కేసులు 1,95,2513కు పెరిగాయి. ఇవాళ్టివరకు 1,91,6914 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 22,358 పాజిటివ్‌ కేసులున్నాయి. మొత్తం 13,241 మంది మృతి చెందారు. ఇవాళ 74,820 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

 

మునుపటి వ్యాసం