పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవితకు 6 నెలల జైలు శిక్ష

రూ.10వేల జరిమానా విధిస్తూ ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పు

మహబూబాబాద్: తెరాస నేత, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవితకు ప్రజాప్రతినిధుల కోర్టులో చుక్కెదురైంది. 2019 ఎన్నికల ప్రచారంలో డబ్బులు పంపిణీ చేశారన్న ఆరోపణలతో మాలోత్ కవితపై బూర్గం పహాడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు విచారణ జరిపిన న్యాయస్థానం ఆమెకు 6 నెలల జైలు శిక్షతోపాటు రూ.10వేల జరిమానా విధిస్తూ కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. 2019 నుంచి ఈ కేసుపై విచారిస్తున్న కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఎంపీకి తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేసింది.