రేపు ఎనిమిది ఎంఎంటీఎస్‌ రైళ్ల రద్దు

ఆక్యుపెన్సీ తక్కువ కావటంతో రద్దు

హైదరాబాద్: తగిన స్థాయిలో ప్రయాణికులు రాకపోవటంతో లింగంపల్లి- హైదరాబాద్‌ మధ్య నడిచే ఎనిమిది ఎంఎంటీఎస్‌ రైలు సర్వీసులను ఆదివారం రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. సోమవారం నుంచి యథావిధిగా సర్వీసులు నడుపుతామని అధికారులు వివరించారు.