నిండు కుండలా మారిన శ్రీశైల జలాశయం

నేడు నాగార్జున సాగర్ లోకి నీటిని విడుదల చేయనున్న అధికారులు

శ్రీశైలం: శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఇవాళ సాయంత్రం 7 గంటలకు శ్రీశైల ప్రాజెక్టు గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ కు నీటిని వదలనున్నారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్ల ఎత్తివేత ఇదే మొదటి సారి కావటం విశేషం. అయితే మొదట ఒక్క గేటును ఎత్తి దిగువకు నీటిని వదలనున్నారు. అనంతరం ఒక్కోటిగా మిగతా గేట్లను ఎత్తుతారు. చివరగా 2007లో ఈ గేట్లను తెరచి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేశారు. ఈ రోజు సాయంత్రం నుంచి సుంకేసుల, జూరాల నుంచి శ్రీశైలానికి 4.65 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఈ జలాశయ నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 881 కి చేరింది. మరోవైపు జలాశయ కుడిగట్టు విద్యుత్ తయారీ కేంద్రంలో ఒక యూనిట్ ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జెన్ కో ముఖ్య ఇంజనీరు సుధీర్ బాబు తెలిపారు. 

మునుపటి వ్యాసం