దిల్లీలో రూ.వెయ్యి త‌గ్గిన వెండి ధ‌ర‌

స్వల్పంగా దిగివచ్చిన బంగారం

న్యూదిల్లీ: దేశ రాజ‌ధాని దిల్లీలో ఇవాళ బంగారం ధ‌ర స్థిరంగా కొనసాగింది. 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.61 త‌గ్గి రూ.46,607కు చేరింది. క్రితం ట్రేడ్‌లో తులం స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.46,668 వ‌ద్ద ముగిసింది. ఇక వెండి ధ‌ర‌ల విషయానికి వస్తే మాత్రం స్వ‌ల్పంగా త‌గ్గాయి. కిలో వెండి ధ‌ర రూ.1,094 త‌గ్గి రూ.64,779కి చేరింది. క్రితం ట్రేడ్‌లో కిలో వెండి ధ‌ర 65,873 వ‌ద్ద ముగిసింది. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో ఔన్స్ బంగారం ధ‌ర 1,800 అమెరిక‌న్ డాల‌ర్‌లు, ఔన్స్ వెండి ధ‌ర 24.76 అమెరిక‌న్ డాల‌ర్‌లు ప‌లికింది.

 

మునుపటి వ్యాసం