ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 2,010 కరోనా కేసులు

నిన్నటి గణాంకాలతో పోలిస్తే స్వల్ప పెరుగుదల

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు నేడు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో70,695 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,010 మందికి  కరోనా వైరస్ సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది. అదే సమయంలో 20 మరణాలు సంభవించినట్లు కూడా స్పష్టం చేసింది. తాజాగా మరో 1,956 మంది బాధితులు కోలుకున్నారు. ఆంధ్రలో ప్రస్తుతం 20,999 కరోనా యాక్టివ్ కేసులున్నాయని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,43,24,626 మందికి కరోని నిర్దారణ పరీక్షలు చేసినట్లు ఆ శాఖ వెల్లడించింది.

మునుపటి వ్యాసం