మూడో రోజు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉండటంతో సూచీలపై ప్రభావం కనిపించింది

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సూచీలు వరుసగా మూడో రోజైన బుధవారమూ నష్టాలను చవిచూశాయి. ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉండటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. అయితే, కీలక రంగాల్లో కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 135 పాయింట్లు నష్టపోయి 52,443కి పడిపోయింది. నిఫ్టీ 37 పాయింట్లు కోల్పోయి 15,709 వద్ద స్థిరపడింది.  డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.39 వద్ద నిలిచింది. బీఎస్‌ఈ 30 సూచీలో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, అల్ట్రాటెక్ సిమెంట్‌, హెచ్‌యూఎల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, బజాజ్‌ ఫినాన్స్‌, ఇన్ఫోసిస్‌, ఐటీసీ షేర్లు లాభాల్లో ముగియగా.. డాక్టర్‌ రెడ్డీస్‌, ఎంఅండ్‌ఎం, పవర్‌ గ్రిడ్‌,  కొటాక్ మహీంద్రా, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, నెస్లే ఇండియా, మారుతీ షేర్లు నష్టాల బాట పట్టాయి. 

 

మునుపటి వ్యాసం