ఆగస్టు 2 న నాగార్జునసాగర్ పర్యటనకు కేసీఆర్: జగదీష్ రెడ్డి

అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడి

నల్గొండ: జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు తేదీ ఖరారైంది. సీఎం కేసీఆర్ ఆగస్టు 2న సాగర్ లో  పర్యటించనున్నట్టు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. హాలియా పట్టణంలో ప్రగతి సమీక్షా కార్యక్రమంలో భాగంగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారని వివరించారు. సాగర్ ఉప ఎన్నికలల్లో నియోజకవర్గానికి ఇచ్చిన హామీల్లో భాగంగా అభివృద్ధిపై కేసీఆర్ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ముఖ్యమంత్రి ఇప్పటికే 26 సార్లు జిల్లాలో పర్యటించారని, తాజా ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకు మరోసారి పర్యటించి అభివృద్ధి పనులపై చర్చిస్తారని జగదీష్ రెడ్డి అన్నారు.