భద్రాద్రి కొత్తగూడెంలో భారీగా వెండి పట్టివేత

పోలీసుల అదుపులో రూ.12 లక్షల ఆభరణాలు

భద్రాద్రి కొత్తగూడెం: మణుగూరు సురక్ష బస్ స్టాండ్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలు చేస్తున్న క్రమంలో రాజమండ్రి నుండి వరంగల్‌కి తరలిస్తున్న ఎలాంటి పత్రాలు లేని 22 కిలోల వెండి పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. సుమారు రూ.12 లక్షల ఆభరణాలను మణుగూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు వాణిజ్య పన్నుల శాఖకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.