విద్యాసంస్థ ముసుగులో కోచింగ్ కేంద్రం నిర్వహిస్తున్నారు: వినియోగదారుల కమిషన్

రూ.60 వేలు పరిహారం కింద విద్యార్థికి చెల్లించాలన్న కమిషన్

ఫిట్ జీ తీరును తప్పుబట్టిన వినియోగదారుల కమిషన్ 

హైదరాబాద్: ఫిట్ జీ తీరును హైదరాబాద్ జిల్లా రెండో వినియోగదారుల కమిషన్ తప్పుబట్టింది. ఫిట్ జీ పినాకిల్ రెండెళ్ల ఇంటీగ్రేటెడ్ కోచింగ్ విద్యార్థి వేసిన పిటిషన్ పై కమిషన్ విచారణ జరిపి తీర్పు వెల్లడించింది. విద్యార్థికి కోచింగ్ ఫీజు రూ. 4.35 లక్షలు, రూ. 50 వేల పరిహారంతో పాటు ఖర్చుల కింద మరో రూ.10 వేలు చెల్లించాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. 45 రోజుల్లో ఈ మొత్తాన్ని చెల్లించనట్లైతే తొమ్మిది శాతం వడ్డీతో సహా విద్యార్థికి అప్పజెప్పాలని కమిషన్ వివరించింది. ఫిట్ జీ బోధన నచ్చనందున ఫీజు తిరిగి ఇవ్వాలని విద్యార్థి కోరాడు. దీంతో  కోచింగ్ మానేసిన ఫీజు తిరిగి ఇచ్చేది లేదని ఫిట్ జీ విద్యార్థికి తేల్చి చెప్పింది.

దీంతో విద్యార్థి కమిషన్ ను ఆశ్రయించాడు. సీటు రద్దు చేసుకున్నా విద్యార్థికి ఫీజు తిరిగి ఇవ్వాలని కమిషన్ స్పష్టం చేసింది. అయితే కోర్సు మొత్తం ఫీజు మొదటే తీసుకోవడాన్ని కమిషన్ తప్పుబట్టింది. కోర్సు మానేస్తే ఫీజు తిరిగి ఇచ్చేది లేదని ముందే వివరించామని ఫిట్ జీ కమిషన్ కు వెల్లడించింది. అందుకు విద్యార్థి అంగీకరించి ఒప్పందంపై సంతకం చేశారన్న ఫిట్ జీ వాదనను కమిషన్ తోసిపుచ్చింది. అంతే కాకుండా విద్యాసంస్థలు, ఫీజు వివాదం వినియోగదారుల కమిషన్ పరిధిలోకి రాదని ఫిట్ జీ తన వాదనను వినిపించింది. ఈ వాదనను కమిషన్ తిరస్కరించింది. విద్యాసంస్థ ముసుగులో కోచింగ్ కేంద్రం నిర్వహిస్తున్నారని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

మునుపటి వ్యాసం