తెలంగాణలో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలు

కరోనాతో రాష్ట్రంలో ఇద్దరు మృతి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖ 1,16,815 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసింది. కొత్తగా 657 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 578 మంది బాధితులు చికిత్సకు కోలుకొన్నారు. వైరస్ బారిన పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,43,093కు చేరింది. ఇవాళ్టి వరకు మొత్తం 6,29,986 మంది కోలుకున్నారు. ఇంకా 9,314 యాక్టివ్‌ కేసులున్నాయి. మొత్తం మరణాలు 3,793కు చేరాయి. రాష్ట్రంలో కొవిడ్‌ మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. రికవరీ రేటు 97.96 శాతంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.