మద్యనిషేధం పేరుతో సీఎం అయిన జగన్‌ మాట తప్పారు: చంద్రబాబు

అగ్రిగోల్డ్ బాధితులకు మొత్తం నగదు ఇవ్వాలి

అమరావతి: దశలవారీ మద్యనిషేధం పేరుతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌రెడ్డి మాట తప్పారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. అగ్రిగోల్డ్ బాధితులకు మొత్తం నగదు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అగ్రిగోల్డ్ ఆస్తులను అండర్ వాల్యూకి ధారాదత్తం చేయరాదన్నారు. ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు రూ.413 కోట్లు డిపాజిట్ చేశామని చెబుతున్నా కాంట్రాక్టర్లకు అందలేదని తెలిపారు. కేంద్రం రూ.1,991 కోట్లు నరేగా బకాయిలను విడుదల చేసినా వాటిని ఇవ్వకుండా దారి మల్లించడాన్ని, కోర్టు ధిక్కరణకు పాల్పడటాన్ని ఖండిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. నిత్యావసర సరుకుల ధరల పెంపుపై ఈ నెల 28న నిరసన కార్యక్రమం చేపడుతామని చంద్రబాబు ప్రకటించారు. 

మునుపటి వ్యాసం