గీత కార్మిక కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ జనగాం శ్రీనివాస్ గౌడ్

వరంగల్: చిట్యాల మండల నైన్ పాక గ్రామంలో కల్లుగీత కార్మికుడు శ్రీపతి రఘుపతి గౌడ్ ఇటీవల మృతి చెందాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వృత్తి మీదనే ఆధారపడి బ్రతికే ఆయన కుటుంబం ప్రస్థుతం దీనస్థితిలో ఉండటంతో గౌడ సంక్షేమ సంఘం ఆర్థిక సాయం అందజేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీపతి గోపి గౌడ్ ఆధ్వర్యంలో, గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ జనగాం శ్రీనివాస్ గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. ఇందుకు సహకరించిన తోటి గౌడ మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీపతి ప్రభాకర్ గౌడ్, వాసు అశోక్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్ర రమేష్ గౌడ్, ఉపాధ్యక్షుడు మాటూరి రవిందర్ గౌడ్, మండల అధ్యక్షుడు బుర్ర శ్రీధర్ గౌడ్ , తాళ్లపెళ్ళి స్వామీ గౌడ్, వేముల రాజేందర్ గౌడ్, గట్టు శ్రవణ్ గౌడ్, శ్రీపతి తిరుపతి గౌడ్, మండ రమేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.