వచ్చే నెల 15కు వాయిదా పడిన జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌

బెయిల్‌ రద్దుచేసి ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని రఘురామ పిటిషన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై సీబీఐ కోర్టు తీర్పును వచ్చే నెల 15కి వాయిదా వేసింది.వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలుచేసిన ఈ పిటిషన్‌పై జూలై ఆఖరులో వాదనలు ముగిశాయి. తీర్పును అప్పటినుంచి కోర్టు రిజర్వు చేసింది. ముఖ్యమంత్రిగా తనకుండే అధికారాలను ఉపయోగించి.. జగన్‌ బెయిల్‌ షరతులు ఉల్లంఘిస్తున్నారని రఘురామ ఏప్రిల్‌ మొదటి వారంలో దాఖలు చేసిన పిటిషన్‌లో ఆరోపించారు. బెయిల్‌ రద్దుచేసి ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని కోరారు.  సీఎం హోదాలో జగన్‌ వివిధ కారణాలు చెబుతూ, కోర్టుకు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. జగన్ బెయిల్ రద్దు చేస్తారా లేక కొనసాగిస్తారా అనే అంశంపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ ఉత్కంఠకు బుధవారం కూడా తెరపడలేదు. 

మునుపటి వ్యాసం