చైతన్య విద్యా సంస్థల ఎదుట విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

టీసీలు ఇవ్వాలని డిమాండ్

విజయవాడ: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో గల చైతన్య విద్యా సంస్థల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ పిల్లలకు టీసీ ఇవ్వాలంటూ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.  వివిధ రాష్ట్రాలు, వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గోశాల చైతన్య క్యాంపస్‌లో మొదటి సంవత్సరం పూర్తి చేశారు. రెండో ఏడాది మరో కాలేజ్‌లో చేరేందకు విద్యార్థుల తల్లిదండ్రులు టీసీలు అడుగుతున్నారు. ఇప్పటికే 1.40 లక్షలు చెల్లించామని, ఇంకా రూ.40 వేలు చెల్లించాలంటూ యాజమాన్యం నిరుంకశ వైఖరి ప్రదర్శిస్తోందని తల్లిదండ్రులు మండిపడ్డారు. తమకు టీసీ ఇవ్వాలంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు పయనమయ్యారు.

మునుపటి వ్యాసం