ఏపీలో ఐదుగురు ఐఏఎస్‌లకు జైలు శిక్ష

పరిహారం ఇవ్వకపోవడంపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం

అమరావతి: ఐదుగురు ఐఏఎస్‌లకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. నెల్లూరు జిల్లా తాళ్లపాకకు చెందిన సాయి బ్రహ్మ అనే మహిళ వద్ద భూమి తీసుకొని పరిహారం ఇవ్వకపోవడంపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు చెప్పినా  చెల్లింపుల్లో జాప్యం జరగడంతో అధికారుల జీతాల నుంచి కట్‌ చేసి పరిహారం ఇవ్వాలని సూచించింది. మన్మోహన్‌ సింగ్‌ ఐఏఎస్‌, అప్పటి నెల్లూరు కలెక్టర్‌ శేషగిరిబాబు, ఎస్‌.ఎస్‌.రావత్‌, ముత్యాల రాజు ఐఏఎస్ లకు జరిమానాతో పాటు మరొక ఐఏఎస్‌కు శిక్ష విధించింది. శిక్షపై అప్పీల్‌ చేసుకునేందుకు హైకోర్టు నెల రోజులు గడువిచ్చింది. ఈ క్రమంలో నెల రోజుల పాటు జైలు శిక్షను సస్పెండ్‌ చేసింది.

 

మునుపటి వ్యాసం