బహ్రెయిన్‌లో ఉన్న తమ వారిని వెనక్కి రప్పించాలి

కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రికి జగన్ లేఖ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌కి  లేఖ రాశారు. బహ్రెయిన్‌లో ఓ ప్రైవేట్‌ సంస్థ యాజమాన్యం చేతిలో చాలా మంది భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిలో చాలా మంది ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారన్నారు. వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ కోరారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ఆయన లేఖలో స్పష్టం చేశారు.

 

మునుపటి వ్యాసం