కోలుకుంటున్న మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌

కాలర్‌ బోన్‌కు చేసిన ఆపరేషన్‌ విజయంతం: వైద్యులు

హైదరాబాద్: మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ కోలుకుంటున్నట్లు అపోలో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆదివారం తేజ్‌కు శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, మొదట్లో ఉన్న దానికంటే వెంటిలేటర్‌ అవసరం ఇప్పుడు తగ్గిందన్నారు. ఇంకా ఆయనను 36 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచాల్సి ఉంది అని అపోలో వైద్యులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా శుక్రవారం సాయంత్రం సాయి ధరమ్‌ తేజ్‌ కేబుల్‌ బ్రిడ్జ్‌ నుంచి ఐకియా వైపు వెళుతుండగా రోడ్డుపై ఇసుక ఉండటంతో అతడి స్పోర్ట్స్‌ బైక్‌ స్కిడ్‌ అయిన అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన కాలర్‌ బోన్‌ ఫ్యాక్చర్‌ కాగా ఛాతి, కుడి కన్నుపై గాయాలయ్యాయి. నిన్న ఆయన కాలర్‌ బోన్‌కు చేసిన ఆపరేషన్‌ విజయంతం అయ్యిందని వైద్యులు తెలిపారు. 

మునుపటి వ్యాసం