పదిహేనేళ్ల కష్టానికి ఫలితం రూ.40 లక్షల వజ్రం

కార్మికులకు దొరికిన 8.22 క్యారెట్ల వ‌జ్రం

భోపాల్: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ప‌న్నా జిల్లాలో సుమారు 8.22 క్యారెట్ల వ‌జ్రం ల‌భ్య‌మైంది. దీని విలువ మార్కెట్‌లో సుమారు 40 ల‌క్ష‌లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారు 15 ఏండ్ల నుంచి నలుగురు కార్మికులు కలిసి వజ్రాల కోసం వెతుకుతున్నారు. ఈ వజ్రం లభించటంతో వారి కష్టానికి ఫలితం లభించినట్లైంది.  

ఈ సందర్భంగా క‌లెక్ట‌ర్ సంజ‌య్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ...ప‌న్నా జిల్లాలోని హిరాపూర్ త‌ప‌రియాన్‌లో ఉన్న లీజు భూమిలో ర‌త‌న్‌లాల్ ప్ర‌జాప‌తితో పాటు ఇత‌రుల‌కు ఆ డైమండ్ దొరికిందని  తెలిపారు. సెప్టెంబ‌ర్ 21న వ‌జ్రం వేలం వేయ‌నున్నారు. వేలంలో వ‌చ్చే డబ్బును ఆ న‌లుగురు కార్మికులకు పంచి ఇవ్వ‌నున్నారు. ఆ డ‌బ్బుతో పిల్ల‌ల‌కు మంచి చ‌దువు చెప్పించ‌నున్న‌ట్టు ర‌ఘువీర్ ప్ర‌జాప‌తి  ఈ సందర్భంగా తెలిపారు.