గణేష్‌ నిమజ్జనంలో ఉద్రిక్తత..పలువురికి గాయాలు

ఊరేగింపునకు అనుమతి లేదంటూ జనసేన మద్దతుదారులను పోలీసులు అడ్డగింత

గుంటూరు: మాచర్ల మండలం కొత్తపల్లి గణేష్‌ నిమజ్జనంలో ఉద్రిక్తత నెలకొంది. ఊరేగింపునకు అనుమతి లేదంటూ జనసేన మద్దతుదారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం వైసీపీ వారి ఊరేగింపునకు అనుమతించారు, మా ఊరేగింపును ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అధికార పార్టీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఆందోళనకారుల పైకి ఎద్దులు దూసుకొచ్చాయి.  ఎద్దులు దూసుకురావడంతో పలువురికి గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. 

మునుపటి వ్యాసం