సానుకూల సంకేతాలతో స్టాక్ సూచీల్లో లాభాలు

కలిసొచ్చిన రిటైల్‌ ద్రవ్యోల్బణం

ముంబయి: గతకొన్ని రోజులుగా ఒడుదొడుకుల్లో పయనిస్తున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి. ఉదయం నుంచి లాభాల్లోనే పయనించాయి.

సెన్సెక్స్‌ ఉదయం 58,482 పాయింట్ల వద్ద ఉత్సాహంగా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 58,482-58,214 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు 69 పాయింట్ల లాభంతో 58,247 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 26 పాయింట్లు లాభపడి 17,381 దగ్గర స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 73.69 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 30 షేర్లలో 16 లాభపడ్డాయి.

కీలక రంగాల్లో కొనుగోళ్ల అండ లభించింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గడం కలిసొచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో నేడు సూచీలు ఆద్యంతం లాభాల్లో పయనించాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఆటో, ఎల్‌అండ్‌టీ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, ఐటీసీ, టైటన్‌, టీసీఎస్‌ షేర్లు రాణించాయి. నెస్లే ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్‌, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫినాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి.

మునుపటి వ్యాసం