రూ.4 కోట్ల ఖరీదైన కారు హీరో రామ్ చరణ్ సొంతం

ప్రత్యేకంగా డిజైన్ చేసుకుని మరీ కొనుగోలు

హైదరాబాద్: టాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు లగ్జరీ కార్లంటే అందరికి ఇష్టమే. మార్కెట్‌లో ఏ కొత్త లగ్జరీ కారు వచ్చినా టాలీవుడ్ అగ్ర హీరోలు తమ వద్ద తెచ్చుకునేందుకు తహతహలాడతారు. ఇటీవల యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఇటలీకి చెందిన వోక్స్‌ వాగన్‌ కంపెనీ అనుబంధ సంస్థ 'లంబోర్ఘిని’ ఊరూస్‌ మోడల్‌ కారును కొనుగోలు చేశారు.

తాజాగా రామ్‌చరణ్‌ కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాటలోనే నడిచాడు. రామ్‌చరణ్‌ మరో న్యూ బ్రాండ్‌ బెంజ్‌ లగ్జరీ కారును సొంతం చేసుకున్నాడు. మెర్సిడెస్‌ మేబాచ్‌ జీఎల్‌ఎస్‌ 600 మోడల్‌ కారు ఇది.ఈ కారు ఖరీదు రూ. 4 కోట్లు. దీనిని చరణ్‌ ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకున్నట్లు తెలుస్తోంది. 

మునుపటి వ్యాసం