ఆంధ్రప్రదేశ్ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల

కరోనాతో తొమ్మిది మంది మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో 49,568 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1,125 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ ధాటికి 9 మంది మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 1,356 మంది కరోనాతో కొలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14, 412 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,31,974 కు చేరగా అందులో 20,03,543 మంది కోలుకున్నారు. కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 14,019 కు చేరినట్లు వైద్యారోగ్యశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. 

మునుపటి వ్యాసం