తెలంగాణలో కొత్తగా 336 పాజిటివ్‌ కేసులు

కరోనాతో ఒక్కరు మృతి

హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 76,481 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 336 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ ధాటికి ఒక్కరు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 306 మంది కరోనాతో కొలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 5,282 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,62,202 కు చేరగా అందులో 6,53,022 మంది కోలుకున్నారు. కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 3,898 కు చేరినట్లు వైద్యారోగ్యశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. 

మునుపటి వ్యాసం