ప్రేమను తిరస్కరించిందనే కోపంతో వేధింపులు

నిందితుడు దిలీప్ అరెస్ట్

హైదరాబాద్: ప్రేమను తిరస్కరించిందనే కోపంతో ఓ యువతిని వేధిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన దిలీప్ అనే వ్యక్తి తన సహోద్యోగురాలిని ప్రేమిస్తున్నాడు. యువతి అతని ప్రేమను తిరస్కరించటంతో  యువతి మార్పింగ్ చిత్రాలను ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేస్తూ వేధించటం మొదలు పెట్టాడు. ఈ మేరకు పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. దీంతో రాచకొండ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకుని దిలీప్ ను అరెస్ట్ చేశారు. దర్యాప్తు చేపడుతున్నారు.