రిటైర్మెంట్ ప్రకటించిన లసిత్ మలింగ

అన్ని ఫార్మట్లకు స్వస్థి పలికిన సీనియర్ బౌలర్

 హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ కు  శ్రీలంక క్రికెట్ దిగ్గజం, బౌలర్ లసిత్ మలింగ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు ఆయన తన యూట్యూబ్ ఛానల్ ద్వారా టీ 20 క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించారు. తనకు ఇన్ని రోజులు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పాడు. ఇంతకుముందే టెస్టులకు, వన్డేలకు గుడ్ బై చెప్పిన మలింగ తాజాగా మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నాడు. దాంతో అధికారికంగా అతడు అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. మలింగ తన చివరి టీ20 మ్యాచ్ ను వెస్టిండీస్ తో 2020 మార్చిలో ఆడాడు. శ్రీలంక తరఫున లసిత్ మలింగ 295 మ్యాచులు ఆడి 390 వికెట్లు తీశాడు. 2011 లో టెస్టులకు 2019 లో వన్డేలకు ఆయన వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.