కరోనాపై అసత్య సమాచారంలో భారత్ టాప్

ఫేస్‌బుక్‌లోనే 66.87 శాతం అసత్య సమాచారం ప్రచురితం

న్యూదిల్లీ: కరోనాపై అంతర్జాలం ద్వారా అత్యధిక అసత్య సమాచారం వ్యాపించిన దేశాల జాబితాలో భారత్‌ టాప్ లో నిలిచింది. ఈ విషయంపై మొత్తం 138 దేశాలల్లో ఈ పరిశోధన నిర్వహించిన సేజెస్‌ ఇంటర్నేషన్‌ ఫెడరేషన్‌ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్స్‌ అండ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ జర్నల్‌ వెల్లడించింది. 138 దేశాల్లో 9,657 భాగాల సమాచారాన్ని ఆన్‌లైన్‌ నుంచి సేకరించారు. ఆయా సమాచారాన్ని ఫ్యాక్ట్‌–చెక్‌ చేసేందుకు 94 సంస్థల సహాయం తీసుకున్నారు. ఇందులో భారత్‌ 18.07 శాతంతో ప్రపంచంలోనే అత్యధిక కరోనా అసత్య సమాచారాన్ని ఉత్పత్తి చేసినట్లు పరిశోధకులు గుర్తించారు.

కరోనా అసత్య సమాచారన్ని ప్రచారం చేసిన దేశాల్లో భారత్‌ 18.07శాతం, అమెరికా 9.74 శాతం, బ్రెజిల్‌ 8.57 శాతం, స్పెయిన్‌ 8.03 టాప్‌–4లో ఉన్నాయని అధ్యయనం స్పష్టం చేసింది. ఇందులో ఒక్క ఫేస్‌బుక్‌లోనే 66.87 శాతం అసత్య సమాచారం ప్రచురితమైందని, మిగతా సోషల్‌ మీడియాలో 84.94 శాతం, ఇంటర్నెట్‌లో 90.5 శాతం అసత్య సమాచారాలు పోస్ట్‌ అయ్యాయని పేర్కొంది. 

భారత్‌లో ఇంటర్నెట్‌ విరివిగా అందుబాటులో ఉండటమూ, తక్కువ ధరకే ఎక్కువ వినియోగించేందుకు అవకాశం ఉండటము, ప్రత్యేకించి సోషల్‌ మీడియా ద్వారా ఈ సమాచారం విరివిగా ప్రచారమైనట్లు కనుగొన్నారు. అదే సమయంలో ఇంటర్నెట్‌ అక్షరాస్యత తక్కువగా ఉండటమే దీనికి కారణమని సేజెస్‌ ఇంటర్నేషన్‌ ఫెడరేషన్‌ అభిప్రాయపడింది.

మునుపటి వ్యాసం