తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్ గా బాజిరెడ్డి గోవర్దన్

ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

హైదాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్  గా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గోవర్థన్ 1999-2004 వరకు ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా, 2004-2009 వరకు బాన్సువాడ ఎమ్మెల్యేగా పని చేశారు. అనంతరం ఆయన తెరాస చేరారు. 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ తరుపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి డీ శ్రీనివాస్ పై గెలుపొందాడు. 2018లో వచ్చిన తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రేకుల భూపతిరెడ్డిపై విజయం సాధించారు. 2015-2018 వరకు, తెలంగాణ శాసనసభ వక్ఫ్ భూములపై ​​హౌస్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు. 

బాజిరెడ్డి గోవర్దన్ గురించి:
1954 , డిసెంబరు 8న దిగంబర్, శాంతమ్మ దంపతులకు జన్మించారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల పరిధిలోని రావుట్ల గ్రామానికి చెందిన గోవర్ధన్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి బిఎ చదివారు. కొంతకాలం పాటు ఆయన వ్యవసాయం చేశారు. గోవర్ధన్ కు శోభారాణితో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు , కుమార్తె ఉన్నారు. 1973లో పోలీస్ పటేల్‌గా పనిచేశారు. గోవర్థన్ ఇండిపెండెంట్ గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1981లో చిమన్‌పల్లి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం 1986లో సిరికొండ ఎంపిపిగా ఎన్నికయ్యారు. 1986లో ఎపి స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ డైరెక్టర్ అయ్యారు. 1994లో ఆర్మూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి టిడిపి అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణ దేవి చేతిలో ఓడిపోయాడు. అనంతరం  పిఏసిఎస్ ఛైర్మన్‌గా, హౌసింగ్ బోర్డు కమిటీ ఛైర్మన్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో గోవర్థన్ కాంగ్రెస్ లో చేరారు. ఆర్టీసీ ఛైర్మన్  గా గోవర్థన్ నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఆయనను అభినందించారు.

సామాన్య ప్రయాణికుడిలా ప్రయాణించిన ఆర్టీసీ ఎండీ:
తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ నిన్న సామాన్య ప్రయాణికుడిలా బస్సెక్కి  సిటీ బస్సు సేవలపై ఆరా తీశారు. నిన్న ఉదయం లక్డీకాపూల్ బస్టాప్‌లో సామాన్య ప్రయాణికుడిలా నిలబడి గండిమైసమ్మ నుంచి సీబీఎస్ మీదుగా అఫ్జల్‌గంజ్ వెళ్లే బస్సు ఎక్కారు. సీబీఎస్‌లో దిగి ఎంజీబీఎస్ వరకు నడుచుకుంటూ వెళ్లారు. దాదాపు మూడు గంటలపాటు బస్ స్టేషన్ అంతా తిరిగారు. స్టేషన్‌లోని మరుగుదొడ్లను పరిశీలించి దుర్వాసన రాకుండా చూడాలని సూచించారు. ఇకపై ఆర్టీసీ బస్సులపై అశ్లీలంగా ఉండే సినిమా పోస్టర్లు కనిపించకుండా చర్యలు తీసుకుంటామని సజ్జనార్ తెలిపారు. కాగా, సజ్జనార్ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు డ్రైవర్ కానీ, కండక్టర్ కానీ ఆయనను గుర్తించకపోవడం గమనార్హం.

మునుపటి వ్యాసం