చిక్కుల్లో గూగుల్ పేమెంట్స్ యాప్..!

యూజర్ల భద్రతకు ముప్పు వాటిల్లుతోందంటూ పిల్ దాఖలు

హైదరాబాద్: ప్రముఖ పేమెంట్‌ యాప్‌ గూగుల్‌ పే వివాదంలో చిక్కుకుంది. యూజర్‌ భద్రతకు ముప్పు వాటిల్లుతోందంటూ ఓ వ్యక్తి దిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశాడు. అనుమతులు లేకుండా యూజర్‌ ఆధార్‌, బ్యాంకింగ్‌ సమాచారాన్ని కలిగి సేకరిస్తోందని ఈ పిటిషన్ లో పేర్కొన్నాడు. 

గూగుల్‌ పే టర్మ్స్‌ అండ్‌ కండిషన్స్‌లో బ్యాంక్‌ అకౌంట్ వివరాలతో పాటు, ఆధార్‌ వివరాల సేకరణ నిబంధనలు ఉన్నాయని.. ఇది అనుమతులకు విరుద్ధంగా నడుస్తున్న వ్యవహారమని అభిజిత్‌ మిశ్రా అనే ఫైనాన్షియల్‌ ఎకనమిస్ట్‌ దిల్లీ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఒక ప్రైవేట్‌ కంపెనీగా ఆధార​, బ్యాకింగ్‌ సమాచారాన్ని సేకరించడం, యాక్సెస్‌ పర్మిషన్‌ లాంటి అధికారాలు ఉండవు. ఇక ఆర్బీఐ ఆథరైజేషన్‌ లేకుండానే లావాదేవీలు నడిపిస్తోందని  మరో పిల్‌ దాఖలు చేశారు.  

ఈ దావాపై దర్యాప్తు చేపట్టిన న్యాయస్థానం యూఐడీఏఐ, ఆర్బీఐలను నిలదీసింది. దాంతోపాటు పిటిషన్‌పై నవంబర్‌ 8లోపు స్పందించాలంటూ గూగుల్‌ డిజిటల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉండగా, పేమెంట్‌ సిస్టమ్‌ ఆపరేటర్‌ కాదని,  థర్డీ పార్టీ అప్లికేషన్‌ ప్రొవైడర్‌ అని గతంలోనే కోర్టుకు ఆర్బీఐ, గూగుల్‌ ఇండియా డిజిటల్‌ సర్వీసెస్‌ తెలిపాయి.

మునుపటి వ్యాసం