ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ.ఏడు కోట్ల విరాళం

తొలివిడతగా రూ.4.20 కోట్లు అందజేసిన రామకృష్ణ ప్రసాద్

తిరుమల: ఎస్వీబీసీ ట్ర‌స్టుకు ఓ ప్రవాస భారతీయ కుటుంబం రూ.4.20 కోట్లు విరాళంగా అందించారు. ఈ మొత్తాన్ని అమెరికాలోని బోస్టన్ లో ఉంటున్న రవి ఐకా తరఫున వారి ప్రతినిధి విజయవాడకు చెందిన రామకృష్ణ ప్రసాద్ గురువారం ఆలయ అధికారులకు అందజేశారు. ఈ మేర‌కు విరాళం చెక్కును తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అద‌న‌పు ఇఒ ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు. 

ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ... రవి ఐకా ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన పలు ట్రస్టులకు దాదాపు రూ.40 కోట్లు విరాళంగా అందించారని తెలిపారు. ఎస్వీబీసీలో కెమెరాలు ఇతర సాంకేతిక పరికరాల కొనుగోలు కోసం రూ.7 కోట్లు విరాళంగా అందించేందుకు ముందుకు వచ్చారన్నారు. ప్రస్తుతం తొలివిడతగా రూ.4.20 కోట్లు అందజేశారని చెప్పారు. ఈ మొత్తంతో ఎస్వీబీసీకి అవసరమైన స్టేట్ ఆఫ్ ఆర్ట్ కెమెరాలు ఇతర సాంకేతిక పరికరాలు కొనుగోలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సిఈఓ సురేష్ కుమార్ పాల్గొన్నారు.

మునుపటి వ్యాసం