ఈ నెల 24 నుంచి శాసనసభ సమావేశాలు

నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం

హైదరాబాద్: ఈ నెల 24 నుంచి శాసనసభ, శాసన మండలి  సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శాసన సభ సమావేశాల నిర్వహించాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.  

తెలంగాణ రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ప్రారంభ‌మైంది. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్యక్ష‌త‌న జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి మంత్రులు హాజ‌ర‌య్యారు. దళితబంధు పథకంపై ఇచ్చే స్టేట్‌మెంట్‌పైనా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. కృష్ణా జలాల విషయంలో అనుసరించాల్సిన వైఖరిపై చర్చించనున్నది. విద్యుత్తు వివాదం, ఉద్యోగ ఖాళీల గుర్తింపు, నియామకాల నోటిఫికేషన్‌ చర్చకు రానున్నట్టు సమాచారం.

మునుపటి వ్యాసం