కొలువుదీరిన గుజరాత్‌ కొత్త మంత్రి వర్గం

భాజపా మాజీ అధ్యక్షుడు జితు వాఘని సహా 24 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం

గాంధీనగర్‌: గుజరాత్ కొత్త మంత్రివర్గం గురువారం ప్రమాణ స్వీకారం చేసింది. మాజీ అసెంబ్లీ స్పీకర్‌ రాజేంద్ర త్రివేది, రాష్ట్ర భాజపా మాజీ అధ్యక్షుడు జితు వాఘని సహా 24 మంది  మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో  గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ వీరితో ప్రమాణం చేయించారు. గవర్నర్‌ 10 మంది కేబినెట్‌ మంత్రులు, 14 మంది సహాయ మంత్రులతో ప్రమాణం చేయించారు.

ఐదుగురు సహాయ మంత్రుల్లో ఐదుగురు స్వతంత్ర బాధ్యతలు కలిగిన మంత్రులు ఉన్నారు. మాజీ సిఎం విజయ్‌ రూపానీ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారికి కొత్త మంత్రివర్గంలో స్థానం కలిపించలేదు. కేబినెట్‌ మంత్రులు బాధ్యతలు స్వీకరించిన వారిలో రాజేంద్ర త్రివేది, జీతు వాఘని, రుషికేష్ పటేల్, పూర్ణేష్ మోడీ, రాఘవ్‌జీ పటేల్, కనుభాయ్ దేశాయ్, కిరిత్సింహ్ రాణా, నరేశ్‌ పటేల్, ప్రదీప్ పర్మార్, అర్జున్‌సింగ్‌ చౌహాన్‌ ఉన్నారు. ఈ కార్యక్రమానికి సిఎం భూపేంద్ర పటేల్‌ తదితరులు  హాజరయ్యారు. కొత్త మంత్రులకు గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌, సిఎం భూపేంద్ర పటేల్‌ అభినందనలతో పాటు శుభాకాంక్షలు తెలిపారు.

మునుపటి వ్యాసం