నా భర్త నాకు అప్పగించండి: నిందితుడు రాజు భార్య

లేకుంటే చచ్చిపోతానంటూ విలపించిన భార్య మౌనిక

హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి చైత్రను దారుణంగా హత్య చేసిన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. కాగా, విషయం తెలుసుకున్న నిందితుడు రాజు భార్య మౌనిక మాట్లాడుతూ.. ‘నా భర్త నాకు కావాలి.. లేకుంటే నేనూ చచ్చిపోతా’ అని విలపించింది. మరోవైపు సింగ‌రేణి కాల‌నీలో పోలీసులు భారీగా మోహ‌రించారు.

దాదాపు 500మంది పోలీసులు ఉన్నారు. అక్క‌డ‌ ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న చోటు చేసుకోకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. నిందితుడు రాజు మృతదేహాన్ని సింగరేణి కాలనీకి తీసుకురావాలని, అది రాజు మృతదేహమో కాదో మేము చెప్తామని చిన్నారి చైత్ర తండ్రి డిమాండ్ చేశాడు.

గురువారం ఉదయం జనగాం జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలో రైలు పట్టాలపై రాజు మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. ఈమేరకు చేతిపై ఉన్న టాటును చూసి నిందితుడు రాజు మృతదేహంగా పోలీసులు గుర్తించారు. దీంతో రాజు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు డీజీపీ మహేందర్ రెడ్డి ధృవీకరించారు. 

మునుపటి వ్యాసం