తూర్పుగోదావరి జిల్లాలో 288 మందికి కరోనా

రాష్ట్ర వ్యాప్తంగా 1,367 కరోనా పాజిటివ్ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 61,178 కొవిడ్‌ టెస్టులు నిర్వహించగా అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 288 మందికి కరోనా సోకింది. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే 1,367 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 20,34,786కు పెరిగాయి. తాజాగా 1,248 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన వ్యవధిలో కోలుకున్న వారితో కలిపి ఇప్పటి వరకు 20,06,034 మంది బాధితులు కోలుకున్నారు.

మరో 14 మంది వైరస్‌ ప్రభావంతో మృతి చెందగా మొత్తం 14,044 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,708 యాక్టివ్‌ కేసులున్నాయని పేర్కొంది. కొత్త కేసుల్లో చిత్తూరులో 217, కృష్ణాలో 155, ప్రకాశంలో 141, నెల్లూరులో 135, పశ్చిమ గోదావరిలో 126 మంది వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షలు చేశారు. కొవిడ్‌తో గుంటూరులో ముగ్గురు, కృష్ణాలో ఇద్దరు, చిత్తూరులో ముగ్గురు, ప్రకాశంలో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, నెల్లూరులో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు మరణించారు.

మునుపటి వ్యాసం