నిర్మల్ బహిరంగ సభలో పాల్గొననున్న అమిత్ షా

ఏర్పాట్లు చేస్తున్న పార్టీ వర్గాలు

హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం నిర్మల్‌కు రానున్నారు. భారతీయ జనతా పార్టీ నిర్వహించబోయే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. దిల్లీ నుంచి నాందేడ్, నాందేడ్ నుంచి హెలీకాఫ్టర్‌లో నిర్మల్ సభకు హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా నిర్మల్ సభ వద్ద రక్తదాన శిబిరం ప్రారంభించనున్నట్లు చెప్పారు. బహిరంగ సభ అనంతరం అమిత్ షా నాందేడ్ నుంచి దిల్లీకి తిరుగు ప్రయాణమవుతారని పేర్కొన్నారు.