గణేష్ నిమజ్జనం: ట్యాంక్ బండ్‌పై ఫ‌న్‌డే రద్దు

భ‌ద్ర‌త దృష్ట్యా ఫ‌న్‌డే నిర్వ‌హించ‌డం లేద‌ని స్పష్టం చేసిన చీఫ్ సెక్ర‌ట‌రీ

హైద‌రాబాద్: గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఆదివారం రోజున ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే ఫ‌న్‌డే ఉండ‌ద‌ని అధికారులు తెలిపారు. ఈ మేరకు అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ చీఫ్ సెక్ర‌ట‌రీ అర‌వింద్ కుమార్ త‌న ట్విట‌ర్ వేదిక‌గా ప్రకటించారు. సుప్రీంకోర్టు మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు హుస్సేన్ సాగ‌ర్, దాని ప‌రిస‌రాల్లో ట్రాఫిక్, ప్ర‌జా భ‌ద్ర‌త దృష్ట్యా ఆదివారం రోజున ఫ‌న్‌డే నిర్వ‌హించ‌డం లేద‌ని స్పష్టం చేశారు. గ‌త ఆదివారం ట్యాంక్‌బండ్‌పై లేజ‌ర్ షోతో పాటు ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి, న‌గ‌ర ప్ర‌జ‌ల‌ను అల‌రించిన విష‌యం తెలిసిందే. గ‌త రెండు ఆదివారాల నుంచి సాయంత్రం 5 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు ట్యాంక్‌బండ్‌పై వాహ‌నాల‌ను అనుమతించ‌డం లేదని వివరించారు.

మునుపటి వ్యాసం