సాయి ధరమ్ తేజ్ ను పరామర్శించిన అల్లు అర్జున్

సాయితేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని బన్నీకి తెలిపిన వైద్యులు

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి ధరమ్ తేజ్ ను హీరో అల్లు అర్జున్ గురువారం పరామర్శించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి అల్లు అర్జున్ చేరుకున్నారు. సాయితేజ్ ను ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్న అనంతరం ఆసుపత్రి వైద్యులతో తేజ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అపోలో వైద్యులు బన్నీకి సాయితేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, మరింత మెరుగుపడిందని వెల్లడించారు. సాయితేజ్ కు ఈ నెల 10న రోడ్డు ప్రమాదం జరగడం తెలిసిందే. ఈ ప్రమాదంలో సాయితేజ్ కాలర్ బోన్ విరగడంతో అపోలో ఆసుపత్రిలో శస్త్రచకిత్స చేశారు. ప్రస్తుతం సాయితేజ్ కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు.