పాక్ లో న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ కు సెక్యూరిటీ అలార్ట్.. సిరీస్ రద్దు

మ్యాచ్ కు కొద్ది గంటల ముందే భద్రతా పరమైన సూచనలు పంపిన న్యూజిలాండ్ ప్రభుత్వం

రావ‌ల్పిండి: పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య నేటి నుంచి ప్రారంభం కావాల్సిన మూడు వన్డేల సిరీస్‌.. మొదటి మ్యాచ్ కు కొద్ది గంటల ముందే నిలిచిపోయింంది. రావ‌ల్పిండిలో శుక్ర‌వారం సాయంత్రం ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య తొలి వ‌న్డే జ‌ర‌గాల్సి ఉంది. అయితే న్యూజిలాండ్ ప్ర‌భుత్వం నుంచి భద్రతా పరమైన సూచనలు రావటంతో ఈ సిరీస్ రద్దు చేశారు.

ఆటగాళ్లు హోటల్ గదులకే పరిమితం కావాలని, మైదానంలోకి రావద్దన్న న్యూజిలాండ్ భద్రతా సలహాదారుల సూచనతో ఆటగాళ్లు హోటల్ గదుల్లోనే ఉండిపోయారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబరు 3వ తేదీ వరకు మూడు వన్డేలు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు పాక్ ఆతిథ్యమిస్తోంది. కివీస్ జట్టు 18 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టడంతో దీనిని రికార్డు సిరీస్‌గా భావించారు.

అయితే, న్యూజిలాండ్ ప్రభుత్వం నుంచి ఆ జట్టు సెక్యూరిటీ సిబ్బందికి అందిన ఆదేశాల నేపథ్యంలో సిరీస్‌ను రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. పర్యటన మొత్తాన్ని రద్దు చేసుకున్న న్యూజిలాండ్ స్వదేశం వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. 

మునుపటి వ్యాసం