మోదీకి శుభాకాంక్షలు తెలిపిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

మరికొన్నేళ్ల పాటు దేశానికి సేవ చేయడానికి బలం చేకూరాలని కోరుకుంటున్నట్లు ట్వీట్

హైదరాబాద్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేటితో 71వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు, వివిధ దేశాల నేతల నుంచి ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. వారితోపాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

"తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల తరపున ప్రధాని నరేంద్రమోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలని , దేవుడు మీకు మంచి దీర్ఘాయువుని ఇచ్చి అనుగ్రహించాలని కోరుకున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మోదీ గొప్ప దార్శనికుడని మరికొన్ని సంవత్సరాలు దేశానికి సేవలు చేయాలని వెల్లడించారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. దేశ ప్రజలకు సుధీర్ఘ కాలం పాటు సేవలందించడానికి మోదీకి మరింత బలం చేకూరాలన్నారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

మునుపటి వ్యాసం