తెలంగాణలో నేడు కరోనాతో ఇద్దరు మృతి

కొత్తగా 214 కరోనా కేసులు నమోదు

హైదరాబాద్‌: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 214 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,63,026కు పెరిగింది. తాజాగా 298 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 6,53,901 కి చేరింది. గడిచిన 24 గంటల వ్యవధిలో వైరస్‌ బారినపడి మరో ఇద్దరు మృతి చెందినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం మరణాల సంఖ్య 3,902కు చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 5,223 యాక్టివ్‌ కేసులున్నాయి. కొవిడ్‌ రికవరీ రేటు 98.62శాతం ఉండగా.. మరణాల రేటు 0.58శాతంగా ఉన్నది. ఇవాళ ఒకే రోజు 52,943 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. కొత్త కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ లో 68 మందికి కరోనా సోకింది. 

 

మునుపటి వ్యాసం