దేశంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలు

తీవ్ర అనారోగ్యంతో 282 మంది మరణించారు

న్యూదిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటి కంటే నేడు స్వలంగా పెరిగాయి. శుక్రవారం 34 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవగా, తాజాగా అవి 35 వేలకు పైగా దాటాయి. దీంతో ఇది నిన్నటికంటే 3.65 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 35,662 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయిట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 
 
దీంతో కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,34,17,390కి చేరింది. ఇందులో 3,40,639 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 3,26,32,222 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 33,798 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా వైరస్ ధాటికి గురై తీవ్ర అనారోగ్యంతో 282 మంది మరణించారు. 

ఇక కరోనా వ్యాక్సినేషన్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. శుక్రవారం దేశవ్యాప్తంగా 2.5 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ చేశారు. దీంతో ఇప్పటివరకు చైనా పేరుతో ఉన్న ఒక్కరోజులో అత్యధిక టీకాలు పంపిణీ చేసిన రికార్డును భారత్‌ తుడిపివేసింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2.5 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ చేశామని వెల్లడించింది.

దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 17 వరకు 55,07,80,273 నమూనాలకు పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి  తెలిపింది. నిన్న ఒకేరోజు 14,48,833 మందికి పరీక్షలు చేశామని వెల్లడించింది.

మునుపటి వ్యాసం