తాత్కాలిక ఉద్యోగులకు సంవత్సరం పాటు ప్రసూతి సెలవులు

తమిళనాడు ప్రభుత్వం వెల్లడి

చెన్నై: ఉద్యోగంలో చేరి ఏడాది పూర్తయిన తాత్కాలిక ఉద్యోగులకు పూర్తి సంవత్సరం పాటు ప్రసూతి సెలవులు ఇస్తున్నట్లు మద్రాసు హైకోర్టుకు తమిళనాడు  ప్రభుత్వం తెలిపింది. రెగ్యూలర్ ఉద్యోగులకు కల్పించినట్లుగానే వీరికి కల్పించామని వెల్లడించింది. అయితే తాత్కాలిక ఉద్యోగులకు ప్రసూతి సెలవులు సరిగ్గా అందటం లేదని, వారు పెట్టుకున్న ప్రసూతి సెలవుల దరఖాస్తులు పెండింగ్ లోనే ఉంటున్నాయని రాజగురు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

రాష్ట్రంలో వివాహమైన మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు అందజేస్తున్న వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు 180 రోజుల నుంచి 270 రోజులకు పెంచుతూ 2016లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని, ఈ రాయితీని తాత్కాలిక ఉద్యోగులకు కొనసాగిస్తూ 2020లో ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. అయితే ఈ జీవో సక్రమంగా అమలుకాలేదని, పలు జిల్లాల్లో ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే తాత్కాలిక మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ఇవ్వడం లేదన్నారు.

వారి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నాయని పేర్కొన్నారు. వారికి వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇచ్చేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలని రాజగురు వేసిన పిటిషన్‌ లో కోరారు. ఈ పిటిషన్‌ విచారించిన ప్రధాన న్యాయమూర్తి సంజీబ్‌ బెనర్జీ, న్యాయమూర్తి ఆదికేశవులులతో కూడిన ధర్మాసనం, ప్రసూతి సెలవులు ఇవ్వడంలో పక్షపాతం చూపరాదని పేర్కొంది. 

మునుపటి వ్యాసం