తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఆట వస్తువులా ఆడుకుంటున్నారు

భాజపాపై మండిపడ్డ గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్గొండ: తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నాయకులు పగటి కలలు కంటున్నారని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. నల్గొండలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... భాజపాకి తెలంగాణలో స్థానం లేదని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంతో భాజపా కి ఎటువంటి సంబంధం లేదని స్వార్థ రాజకీయాల కోసం భాజపా నాయకులు తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఆట వస్తువులా ఆడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్‌తో భాజపా కి ఎటువంటి సంబంధం లేనప్పటికీ, రాజకీయ లబ్ధి పొందేందుకు ఆయన పేరును భాజపా  నాయకులు వాడుకుంటున్నారని గుత్తా తెలిపారు. కాంగ్రెస్ నాయకులు కూడా తెలంగాణ సాయుధ పోరాటాన్ని తమ సొంత రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంతకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ సెప్టెంబర్ 17న విమోచన దినంగా ఎందుకు జరపలేదని గుత్తా ప్రశ్నించారు. భాజపా  హిందుత్వాన్ని ప్రోత్సహించాలని ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ఎఐఎంను బూచిగా చూపెట్టి హిందువులను మభ్య పెట్టేందుకు భాజపా నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి సుపరిపాలన అందిస్తోందన్నారు. మరో 20 ఏళ్లు టీఆర్ఎస్ మాత్రమే అధికారంలో ఉంటుందని గుత్తా జోస్యం చెప్పారు. తన సుపరిపాలనతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని ఆయన కొనియాడారు.

మునుపటి వ్యాసం