భర్త ఆచూకి తెలుపగలరని కెనడా నుంచి సీపీకి యువతి ట్వీట్

భారత్‌ హైకమిషన్‌ కి ఫిర్యాదు చేసిన పురోగతి లేదని వెల్లడి

హైదరాబాద్‌: కెనడా నుంచి భర్త తనను వదిలేసి భారత్ వచ్చేశారని అతని ఆచూకి తెలపాలని ఓ వివాహిత మహిళ నగర సీపీకి విజ్ఞప్తి చేసింది. అనుగుల దీప్తి అనే వివాహిత మహిళ కెనడాలోని మాంట్రియల్‌లో ఉంటున్నారు. తన భర్త మూడు నెలల కిందట తనను వదిలేసి భారత్ వచ్చేశారని, అతని ఆచూకి కనుక్కోవాలని నగర సీపీ మహేష్‌ భగవత్‌కు ట్వీట్‌ చేసింది.

తన భర్త అనుగుల చంద్రశేఖర్‌ రెడ్డి కెనడాలో మెక్‌గ్రిల్‌ యూనివర్సిటీలో రసాయన శాస్త్ర విభాగంలో పనిచేసేవారని  ఆయనకు సంబంధించిన వివరాలు వెల్లడించింది. ఇదిలా ఉండగాన, ఆగస్టు 9 నుంచి తన భర్త ఆచూకీ లేదని తాను భారత్‌ హైకమిషన్‌ వారికి 2021 ఆగస్టు 20న ఫిర్యాదు చేశానని తెలిపింది.

ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని వివరించింది. కాగా, తన బావ శ్రీనివాస్‌ రెడ్డి చైతన్యపురిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటారని ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని తాను తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నానని ట్విట్టర్ లో ఆమె పేర్కొంది. ఎలాగైన తన భర్త ఆచూకీ తెలుసుకోవాలని సీపీని ఆమె కోరింది.

మునుపటి వ్యాసం